వినాయకుడి లడ్డూ వేలంలో ముస్లిం యువకుడి విజయం
ముదిగుబ్బ, ముదిగుబ్బ మండలం మలకవేముల క్రాస్‌లో బండి మల్లికార్జున గ్రామ కమిటీ అధ్యక్షుడు రమణ నాయక్ ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన వినాయకుడి లడ్డూ వేలంలో నూర్ భాషా రూ.30 వేలతో లడ్డూను దక్కించుకున్నారు.
అలాగే మారి వికాస్ రూ.5 వేలతో కొబ్బరికాయను, పరమేశ్వరి రూ.3 వేలతో మరో ప్రసాదాన్ని వేలంలో దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో బండి అఖిల్, డాడీ వినోద్, ఆదిమూర్తి, లోకేష్ తదితరులు పాల్గొన్నారు
వినాయకుడి లడ్డూ వేలంలో ముస్లిం యువకుడి విజయం..
