రూ.3.06 కోట్ల అక్రమాస్తులు.. మైనింగ్ డీడీ ఇంటిపై ఏసీబీ సోదాలు

అక్రమాస్తుల ఆరోపణలు ఎదుర్కొంటున్న వరంగల్ భూగర్భ గనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ బొజ్జ జయరాజ్ నివాసంపై గురువారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఆకస్మికంగా సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సుమారు రూ.3.06 కోట్ల విలువైన ఆస్తులు గుర్తించినట్లు అధికారులు తెలిపారు.

జయరాజ్‌తో పాటు ఆయనకు సంబంధించిన 8 మంది బంధువుల ఇళ్లలోనూ ఏకకాలంలో సోదాలు చేపట్టారు. బోడుప్పల్‌లో జీ+2 భవనం, కేపీహెచ్‌బీలో ప్లాట్, కీసర, తుంగతుర్తి, తూప్రాన్, సూర్యాపేటలో ఐదు ఫ్లాట్లు, 3.21 ఎకరాల వ్యవసాయ భూమి, రూ.10 లక్షల నగదు, బంగారం, బ్యాంకు డిపాజిట్లు, ఖాతాల్లోని నగదు తదితరాలను ఏసీబీ గుర్తించినట్లు వెల్లడించింది.

ఈ ఆస్తుల మార్కెట్ విలువ మరింత ఎక్కువగా ఉండొచ్చని అధికారులు తెలిపారు. అలాగే జయరాజ్‌ డ్రైవర్ సత్తునూరి యాదయ్య సెల్‌ఫోన్‌ను పరిశీలించగా, అతని ఖాతా నుంచి కుమార్తె ఖాతాకు రూ.24.8 లక్షలు బదిలీ అయినట్లు గుర్తించారు. ఈ మొత్తాన్ని అక్రమ ఇసుక రవాణా ద్వారా సంపాదించినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నామని ఏసీబీ అధికారులు తెలిపారు.

Posted Under AP
yes9tv