ఈ నెల 30వ తేదీన అనంతపురము నగరంలో జరుగనున్న అనంతపురము జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పూల నాగరాజు గారి కుమారుడు మరియు గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం గారి కుమార్తె వివాహ మహోత్సవానికి హాజరుకానున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పర్యటన ఏర్పాట్లను అధికారులతో పరిశీలించిన పూల నాగరాజు గారు
ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీధర్ చౌదరి, ఏడిసిసి బ్యాంకు చైర్మన్ ముంటిమడుగు కేశవరెడ్డి, పార్టీ నాయకులు కూచి హరి, ఏపీ ఎస్టీ కమిషన్ మెంబెర్ వెంకటప్ప, జిల్లా కలెక్టర్ ఆనంద్ గారు, ఎస్పీ జగదీష్ గారు మరియు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.
వివాహ వేడుక రోజున గౌరవ సీఎం గారి పర్యటనలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు పూల నాగరాజు గారు సూచనలు చేసారు.
అనంతరం హెలిపాడ్ ను పరిశీలించి, MYR ఫంక్షన్ హాల్ వరకు ప్రయాణించి, వేదిక తదితర ఏర్పాట్లను పరిశీలించారు.
