కర్నూలు జిల్లా ఆస్పరిమండలం కారమంచి గ్రామంలోచంద్రబాబు కుమార్తె వివాహ వేడుకలకు ఆలూరు పాత్రికేయుల హాజరు..
ఆలూరు నియోజకవర్గ సాక్షి పత్రిక ఇన్చార్జ్ శ్రీ చంద్రబాబు గారి కుమార్తె వివాహ వేడుకలు ఆస్పరి మండలం కారుమంచి గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఈ వివాహ వేడుకలకు ఆలూరు ప్రాంతానికి చెందిన పలువురు పాత్రికేయులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.
ఈ సందర్భంగా పాత్రికేయులు శ్రీ చంద్రబాబు గారిని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. నవదంపతులు సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో వివిధ పత్రికలు, టీవీ ఛానళ్లకు చెందిన జర్నలిస్టులు పాల్గొని చంద్రబాబు కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా ముచ్చటించారు.
