బళ్లారి సమీపంలో హైవేపై వ్యవసాయ కూలీల ఆటో బోల్తా…

అనంతపురం జిల్లా
రాయదుర్గం నియోజకవర్గం•••••

బళ్లారి సమీపంలో హైవేపై వ్యవసాయ కూలీల ఆటో బోల్తా

*ఉద్దేహాల్ కు చెందిన 10 మంది కూలీలకు తీవ్ర గాయాలు

అనంతపురం జిల్లా బొమ్మనహాల్ మండలం ఉద్దేహాల్ గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీల ఆటో కర్ణాటక రాష్ట్ర బళ్లారి సమీపంలో హైవేపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.

బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉద్దేహాల్ గ్రామానికి చెందిన గోవిందు ఆటోలో 26 మంది కూలీలతో బళ్లారి జిల్లా ఇమరాపురం వద్ద వరి నాట్లు వేయడానికి ఉదయం బయలుదేరి వెళ్లారు. మధ్యాహ్నం బళ్లారి హైవేలో వెళ్తుండగా ఒక్కసారిగా టైరు బరస్ట్ కావడంతో ఆటో అదుపుతప్పి బోల్తా పడింది.

ఈ ప్రమాదంలో శివమ్మ, చిట్టి, గంగమ్మ, అక్కమ్మ, లక్ష్మి, గోవిందు, కొక్కమ్మ తదితరులకు తీవ్ర గాయాలయ్యాయి. ఆటోలో 26 మంది ప్రయాణిస్తుండగా సుమారు 10 మందికి గాయాలు తగిలి ఆసుపత్రి పాలయ్యారు. మిగిలిన వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

గాయపడిన వారిని అత్యవసర వాహనంలో బళ్లారి వింస్ (VIMS) ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు బాధితులు తెలిపారు.

 

Posted Under AP
Editor