అనంతపురం జిల్లా రాయదుర్గం
- ఈనెల 28 లోగా తుంగభద్ర జలాలు విడుదల చేయాలి..
- గోనెహాలు క్రాస్ వద్ద హెచ్ఎల్సీ సాగునీటి విడుదల చేయాలంటూ రైతుల రాస్తారోకో..
- పార్టీలకు అతీతంగా రైతాంగాన్ని ఆదుకోకపోతే ఉద్యమాలు ఉదృతం చేస్తాం… వైఎస్ఆర్సిపి సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి.
అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం బొమ్మనహల్, కనేకల్ మండలాల్లోని హెచ్ ఎల్ సి ఆయకట్టు రైతులకు ఈనెల 28లోగా సాగునీరు అందించాలంటూ రాయదుర్గం నియోజకవర్గపు వైఎస్ఆర్సిపి సమన్వయకర్త మెట్లు గోవిందరెడ్డి ఆధ్వర్యంలో పార్టీలకు అతీతంగా భారీ ఎత్తున తుంగభద్ర జలాలు అందించాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
బొమ్మనహాళ్ మండలం గోనెహాలు క్రాస్ ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.
తుంగభద్ర జలాలు వెంటనే విడుదల చేయాలి ,రైతాంగాన్ని ఆదుకోవాలి,
ఉన్నత అధికారులు స్పందించాలంటూ నినాదాలతో గంటపాటు రోడ్డుపై రైతులు నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి మాట్లాడుతూ
ఆయకట్టు రైతులకు సాగునీరు అందక వరి నార్లు ఎండిపోయే పరిస్థితి రావడంతో రైతుల సహనం నశించిందన్నారూ రైతుల పంటలను కాపాడేందుకు వెంటనే నీటిని విడుదల చేయాలని డిమాండ్ డిమాండ్ చేశారు.
వేలాదిరూపాయలు పెట్టుబడి పెట్టి వరి నార్లు పెంచుతుంటే, సాగునీరు విడుదల చేయడంలో అధికారుల నిర్లక్ష్యం పై మండిపడ్డారు.
“నార్లు చేతికొచ్చి ఎండిపోతుంటే అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.
పంటలు నాశనం అయిన తర్వాత నీళ్లు వదిలితే ఉపయోగం ఏమిటి?” అంటూ రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
సాగునీరు విడుదల చేసే వరకు తమ పోరాటం ఆగదని రైతులు హెచ్చరించారు.
రైతుల ఆందోళనతో గోనేహాల్ గ్రామం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రైతుల కష్టాలను అధికారులు వెంటనే గుర్తించి నీటిని విడుదల చేయాలని, లేకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని రైతులు హెచ్చరించారు.
