అనంతపురం జిల్లా రాయదుర్గం
మెగాస్టార్ చిరంజీవి 71వ జన్మదిన వేడుకలు రాయదుర్గం పట్టణంలో ఘనంగా
మెగా యూత్ ఫోర్స్ కన్వీనర్ శ్రీ మహబూబ్ బాషా, జాయింట్ కన్వీనర్ తడలా సతీష్ ఆధ్వర్యంలో మెగాస్టార్ పద్మభూషణ్ శ్రీ చిరంజీవి గారి 71వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. బళ్లారి రోడ్డులోని ఏ వన్ డిజిటల్ వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ మంజునాథ్ గౌడ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మెగా అభిమానులు, మెగా యూత్ ఫోర్స్ సభ్యులు కేక్ కట్ చేసి చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. చిరంజీవి గారు సినీ రంగంలో ఎన్నో సంవత్సరాలుగా అందిస్తున్న సేవలను, సమాజ సేవలో ఆయన చేస్తున్న కార్యక్రమాలను గుర్తుచేసుకున్నారు. ఆయన ఆయురారోగ్యాలతో, ఆనందంగా మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని అభిమానులు ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మెగా అభిమానులు, జనసేన నాయకులు, కార్యకర్తలు, యువత పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు
