సానేవారిపల్లిలో ‘రైతన్న మీకోసం కార్యక్రమం – వేరుశెనగ కాయల పంపిణీ
ముదిగుబ్బ yes9 TV
ముదిగుబ్బ మండలంలోని సానేవారిపల్లి గ్రామంలో ‘రైతన్న మీకోసం’ కార్యక్రమాన్ని నిర్వహించి రైతులకు వేరుశెనగ కాయలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రైతుల సమస్యలు, వ్యవసాయానికి సంబంధించిన అంశాలపై చర్చించి రైతులకు అవసరమైన సూచనలు అందించారు.
ఈ కార్యక్రమంలో ఆర్టికల్స్ అసిస్టెంట్ పవన్ కుమార్, ముదిగుబ్బ మండల కన్వీనర్ తుమ్మల మనోహర్, గుత్త సూర్యనారాయణ, ఎంపీటీసీ మంజునాథ్, సానేవారిపల్లి గ్రామ అధ్యక్షుడు వెంకటనాయుడు, నబీ రసూల్, సురేంద్ర, రాము, బాబాజాన్, తెలుగు యువత ఉపాధ్యక్షుడు కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. అలాగే గ్రామానికి చెందిన పలువురు రైతులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
సానేవారిపల్లిలో ‘రైతన్న మీకోసం కార్యక్రమం – వేరుశెనగ కాయల పంపిణీ
