Latest Posts

పరవాడ ఫార్మాసిటీలో ఘోర అగ్నిప్రమాదం….

పరవాడ ఫార్మాసిటీలో ఘోర అగ్నిప్రమాదం
.. ఇద్దరు కార్మికులు సజీవదహనం

అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలోని దక్షిణ ఎనర్జీ కెమికల్ కర్మాగారంలో మంగళవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో ఇద్దరు కార్మికులు సజీవదహన మయ్యారు. మృతులను చోడవరం మండలం గోవాడ గ్రామానికి చెందిన వేపాడ వెంకటేష్, అచ్యుతాపురం ప్రాంతానికి చెందిన త్రినాథ్‌గా గుర్తించారు. మరో ఇద్దరు కార్మికులు మంటల్లో చిక్కుకున్నట్లు సమాచారం.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపు లోకి తీసుకువచ్చారు. గాయపడిన వారిని విశాఖ కేజీహెచ్ కు తరలించి చికిత్స అందిస్తు న్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ సూర్యమాన్ పటేల్, పరవాడ ఇంచార్జి డీఎస్పీ మోహనరావు ఘటనాస్థలిని పరిశీలించి పరిస్థితిని సమీక్షించా రు.

ఇదిలా ఉండగా, పరిశ్రమలో భద్రతా ప్రమాణాల అమలులో నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపమే ప్రమాదానికి కారణమని సీఐటీయూ జిల్లా నేత గనిశెట్టి సత్యనారాయణ ఆరోపించా రు.

ఈ ఘటనపై ముఖ్యమంత్రి నారా. చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలుపుతూ, గాయ పడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. అలాగే హోంమంత్రి వంగలపుడి అనిత జిల్లా అధికారులతో మాట్లా డి సహాయక చర్యలను వేగవంతం చేయాలని సూచించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆమె తెలిపారు.

Posted Under AP
Editor