Latest Posts

కళ్యాణదుర్గం పట్టణంలో రెండు ఇళ్లలో అర్థరాత్రి దొంగలు బీభత్సం…

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం

*కళ్యాణదుర్గం పట్టణంలో రెండు ఇళ్లలో అర్థరాత్రి దొంగలు బీభత్సం*

వరుస దొంగతనాలతో బెంబేలెత్తుతున్న పట్టణ ప్రజలు

 

ఒకే రాత్రి రెండు ఇళ్లల్లో చోరీ.. బంగారం అపహరణ చేసినట్లు సమాచారం

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని జయనగర్ ప్రాంతంలో అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. ఒకే రాత్రిలో రెండు ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.

జయనగర్‌లోని హీరో షోరూమ్ నిర్వాహకుడు ప్రభంద్ నివాసంలోకి చొరబడిన దొంగలు ఇంట్లోని బీరువాలను ధ్వంసం చేసి విలువైన నగలు, వస్తువులను అపహరించినట్లు సమాచారం. అంతేకాకుండా ఇంట్లో ఉన్న భారీ లాకర్లను కూడా ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది.

అదే ప్రాంతంలో మరో ఇంటిలో కూడా చోరీ జరగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. భారీ మొత్తంలో బంగారం, నగదు అపహరణకు గురైనట్లు ప్రాథమిక సమాచారం వెలువడింది.

ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిసింది.

Posted Under AP
Editor