Latest Posts

ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి రోడ్డుపై ఆటోలు నిలపరాదు.. ఓవర్‌లోడ్ చేయరాదు

ముదిగుబ్బ: రోడ్డు ప్రమాదాల నివారణ, ప్రయాణికుల భద్రత కోసం ఆటో డ్రైవర్లకు ముదిగుబ్బ పోలీసులు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ ఐపీఎస్ ఆదేశాల మేరకు, ధర్మవరం డీఎస్పీ బీవీ జగన్నాధ రాజు సూచనలతో ఈ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ముదిగుబ్బ ఇన్‌స్పెక్టర్ కే. రామ సుబ్బయ్య ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు. రోడ్డు పక్కన ఆటోలు నిలిపి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించరాదని, నిబంధనలకు మించి ప్రయాణికులను ఎక్కించుకుని ఓవర్‌లోడ్ చేయరాదని సూచించారు.

డ్రైవింగ్ లైసెన్స్, వాహన ధృవపత్రాలు తప్పనిసరిగా కలిగి ఉండాలని, వేగంగా, నిర్లక్ష్యంగా వాహనాలు నడపరాదని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.

Posted Under AP
Editor