Latest Posts

‘మానవ సేవయే మాధవ సేవ’: ఇన్ఫినిటీ ఛారిటబుల్ ట్రస్ట్‌కు ప్రతిష్టాత్మక జీ తెలుగు న్యూస్ హెల్త్‌కేర్ అవార్డు ప్రదానం

*మానవ సేవయే మాధవ సేవ’: ఇన్ఫినిటీ ఛారిటబుల్ ట్రస్ట్‌ చైర్మన్ బద్దే నాయక్ గారికి జీ తెలుగు న్యూస్ హెల్త్‌కేర్ అవార్డు ప్రదానం

“ఆరోగ్యమే మహాభాగ్యం.. అంతకంటే గొప్ప భాగ్యం రోగగ్రస్తుల సేవలో భాగస్వామ్యం కావడం* .”

ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బద్దే నాయక్ గారి సేవా కార్యక్రమాలపై కేంద్ర మంత్రులు,తెలంగాణ గవర్నర్ ప్రశంసలు. ..
==================================
హైదరాబాద్ :
వైద్య-ఆరోగ్య రంగంలో విశేష సేవలు అందిస్తూ, సమాజ శ్రేయస్సే ధ్యేయంగా ముందుకు సాగుతున్న ఉత్తమ వైద్యులను, స్వచ్ఛంద సంస్థలను ప్రోత్సహించేందుకు జాతీయ ప్రముఖ మీడియా సంస్థ ‘జీ తెలుగు న్యూస్ ’ ప్రతిష్టాత్మక అవార్డుల వేడుకను నిర్వహించింది. 2025-2026 సంవత్సరానికి గాను ఆరోగ్య రంగంలో అద్భుతమైన సేవలందించిన పలువురు ప్రముఖులకు ఈ వేడుకలో పురస్కారాలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో భాగంగా, క్షయ (టి.బి) వ్యాధిగ్రస్తుల ఆరోగ్య పరిరక్షణ కోసం, వారి పునరావాసం కోసం నిరంతరం శ్రమిస్తూ, తమ ఉదారతను చాటుకుంటున్న ‘ఇన్ఫినిటీ ఛారిటబుల్ ట్రస్ట్’ ప్రతిష్టాత్మక అవార్డును దక్కించుకుంది.
*కేంద్ర మంత్రి చేతుల మీదుగా పురస్కారం అందుకున్న ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన

Posted Under AP
Editor