బత్తలపల్లిలో ఇంధన కొరతపై తహసీల్దార్‌కు వినతి

తాడిమర్రి(yes9tv)బత్తలపల్లిలో ఇంధన కొరతపై తహసీల్దార్‌కు వినతి
బత్తలపల్లి, ఏప్రిల్ 27:
బత్తలపల్లి మండలంలో కొనసాగుతున్న పెట్రోల్, డీజిల్ కొరతపై బహుజన సమాజ్ పార్టీ, ఎస్సీ జన సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నాయకులు సోమవారం ఉప తహసీల్దార్ ప్రసన్నకుమార్‌కు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా బీఎస్పీ నియోజకవర్గ బాధ్యులు సాకే వినయ్ కుమార్, ఎస్సీ జన సంఘం నాయకులు సాకే కుళ్లాయప్ప మాట్లాడుతూ ఇంధన కొరత కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఎండలు పెరిగిన వేళ బంకుల వద్ద గంటల తరబడి క్యూలో నిలబడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
డీజిల్ అందుబాటులో లేకపోవడంతో రైతుల సాగు పనులు నిలిచిపోయి, పంటలు ఎండిపోతున్నాయని తెలిపారు. ప్రభుత్వం నిల్వలు ఉన్నాయని చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో “నో స్టాక్” బోర్డులు కనిపిస్తున్నాయని విమర్శించారు.
డిమాండ్లు
అన్ని బంకుల్లో తక్షణమే ఇంధన సరఫరా పునరుద్ధరించాలి
బ్లాక్ మార్కెట్‌పై కఠిన చర్యలు తీసుకోవాలి
రైతులు, అత్యవసర సేవలకు ప్రాధాన్యత ఇవ్వాలి
నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలి
హెచ్చరిక
సమస్యను వెంటనే పరిష్కరించకపోతే రాస్తారోకో, కలెక్టర్ కార్యాలయ ముట్టడి చేపడతామని నాయకులు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు నారాయణస్వామి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Posted Under AP
Editor