ఆస్పరి మండలం తొగలగల్లు గ్రామంలో పాఠశాల చివరి రోజు వేడుకలు గ్రామ సర్పంచ్ ఆంజనేయ యాదవ్ మరియు జనసేన పార్టీ మండల ప్రధాన కార్యదర్శి కె. జగన్నాథ్ సమక్షంలో అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా చిన్న పిల్లలు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు గ్రామస్తులను విశేషంగా అలరించాయి. పాఠశాల ఉపాధ్యాయులు కురువ తులసయ్య విద్యార్థులను తీర్చిదిద్దుతున్న తీరును, వారి క్రమశిక్షణను చూసి అతిథులు మరియు గ్రామ పెద్దలు హర్షం వ్యక్తం చేశారు. గ్రామంలో విద్యాభివృద్ధికి తులసయ్య గారు చేస్తున్న కృషిని కొనియాడుతూ, ఆయన విద్యా బోధనలో తనకు తానే సాటి అని గ్రామస్తులు ఈ సందర్భంగా ప్రశంసల జల్లు కురిపించారు.
తొగలగల్లు పాఠశాల వేడుకల్లో సందడి: విద్యార్థుల ప్రతిభను అభినందించిన సర్పంచ్ ఆంజనేయ యాదవ్
