రాయదుర్గంలో ప్రైవేట్ పాఠశాలల అక్రమ అడ్మిషన్ల జోరు: విద్యాశాఖ అధికారులకు ఏఐఎస్ఎఫ్ (AISF) వినతి!

అనంతపురం జిల్లా, రాయదుర్గం.

*రాయదుర్గం కేంద్రంగా ప్రైవేట్ పాఠశాలలు ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తున్నారు.*

*ప్రభుత్వ నిబంధనలు బెకతరు చేస్తూ జోరుగా ప్రైవేట్ పాఠశాలల అక్రమ అడ్మిషన్లు*

*ముందస్తు అడ్మిషన్లను చూసి చూడనట్లుగా వదిలేస్తున్న రాయదుర్గం విద్యాశాఖ అధికారులు*

*విద్యాశాఖ అధికారులు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు సంఖ్య పెంచలేరు, ప్రభుత్వ విద్యను బలోపేతం చేయలేరు గాని. ప్రైవేట్ పాఠశాలలకు పరోక్షంగా వత్తాసు పలకడం ఏంటి*

*విద్యార్థుల సంఘాలు అడ్డుకుంటే మీ ఇష్టం వచ్చినవారికి చెప్పమంటున్న ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు*

*ముందస్తు అడ్మిషన్లపై పలుమార్లు విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదులు అందించిన ఒక్కసారి కూడా చర్యలు తీసుకొని సందర్భాలు ఉన్నాయి*

*ప్రభుత్వమే ప్రైవేట్ పాఠశాలలకు నిర్ణీత ధరలతో పుస్తకాలను అందించాలి* *అక్రమాల వసూళ్లకు అడ్డుకట్ట వేయాలి*

*ప్రైవేటు పాఠశాలలో యాన్యువల్ డే సందర్భంగా తల్లిదండ్రులతో చేసే వసూళ్ళను నియంత్రించాలి*

*ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలలో 25% ఉచిత విద్య అందించే విద్యార్థుల తల్లిదండ్రులతో ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు స్కూల్ యాజమాన్యాలు.ప్రభుత్వమే చెల్లిస్తుందని తల్లిదండ్రులు తెలియజేసిన రాయదుర్గం విద్యాశాఖ అధికారులే వసూళ్లు చేయమని చెప్పారని అంటున్న ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు*

*ప్రభుత్వ ఉచిత విద్యకు నీళ్లు చల్లుతున్న ప్రైవేట్ పాఠశాలలు*

ప్రైవేట్ పాఠశాలలపై సమస్యలతో కూడిన వినతిపత్రం ను రాయదుర్గం విద్యాశాఖ అధికారి గారికి ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అందజేయడం జరిగింది

*అనంతపురం జిల్లా ఏఐఎస్ఎఫ్ కోశాధికారి అంజనేయులు మాట్లాడుతూ,*

రాయదుర్గం కేంద్రంగా ప్రైవేట్ పాఠశాలలు విచ్చలవిడిగా ముందస్తు అడ్మిషన్లతో జనవరి నుండే ప్రారంభించి ఇప్పటికే పూర్తిస్థాయిలో లిస్టును తయారు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఈ సమస్యలపై పలుమార్లు విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదులు అందజేసిన ఏ ప్రైవేట్ పాఠశాలలకు కూడా కనీసం ఒక సర్క్యులర్ అందించిన సందర్భాలు లేవు. ప్రభుత్వం 25%తో ప్రతి ప్రైవేట్ పాఠశాలలో పేద పిల్లలు చదువుకోవడానికి అవకాశం కల్పించింది. అలా తల్లిదండ్రులు అప్లై చేసుకున్న ప్రైవేట్ స్కూళ్లకే అడ్మిషన్లు రావడంతో పిల్లలను చేరిస్తే ప్రభుత్వం డబ్బులు వెయ్యకపోతే మీరే కట్టాలని తల్లిదండ్రులకు ముందుగానే సూచిస్తూ, ఇప్పటికే పలు పాఠశాలలో ప్రభుత్వం కల్పించిన ఉచిత విద్య విద్యార్థులు కచ్చితంగా మీరు ఫీజులు చెల్లించాల్సిందే అని రాయదుర్గం ప్రాంతంలో ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాలల తల్లిదండ్రుల పైన తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్న సందర్భాలు ఉన్నాయి. తల్లిదండ్రులు మా పిల్లల ఫీజు ప్రభుత్వాలే చెల్లిస్తాయి కదా అని చెప్పిన కూడా. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు మాకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఫీజులు అందలేదు మీరు కట్టాల్సిందే అని తల్లిదండ్రులకు తెలియజేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు విద్యాశాఖ అధికారులు దగ్గరికి వెళ్లి సమాచారం తెలుసుకుంటాం అంటే. వారే ఉచిత విద్యాకు సెలెక్ట్ అయిన పిల్లల తల్లిదండ్రులతో నగదు వసూళ్లు చేసుకోవాలని. సూచించారని ముక్తకంఠంతో ప్రైవేట్ పాఠశాలలు తల్లిదండ్రులకు తెలియజేస్తున్నారు. ఇక ఉచిత విద్యకు ఎంపికైన పిల్లల తల్లిదండ్రులు ఏం చేయాలో తెలీక దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్న కొంతమేర నగదు చెల్లించుకుంటూ వస్తున్న సందర్భాలు ఉన్నాయి. ఇక ముందస్తు అక్రమ అడ్మిషన్ల విషయానికొస్తే తమ స్కూలు గొప్ప అంటే తమ స్కూలు గొప్ప అంటూ అన్ని రకాల సదుపాయాలు మా స్కూలు అందిస్తుందని. ఇప్పుడు చేర్పిస్తే అడ్మిషన్ ఫీజు ఉండదంటూ ఇంకా కొంచెం ముందుగా స్కూల్లో నమోదు చేసుకుంటే సగం ఫీజు మీకు మినహా ఇస్తామంటూ రకరకాల మాటలతో తల్లిదండ్రులను ఒప్పించి అడ్మిషన్లను నిర్వహిస్తున్నారు. ముందస్తు అడ్మిషన్లపై విద్యార్థి సంఘాలు అడ్డుకున్న ప్రతి సందర్భంలోన మీకు అనుమతులు ఎవరు ఇచ్చారు అని అడిగితే చాలు మీకు ఇష్టం ఉన్నచోట చెప్పుకోవాలని మీకు చేతయింది చేసుకోవాలని మేము మాత్రం అడ్మిషన్లు నిర్వహించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని. నీస్సందేహంగా ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలు తెలియజేస్తున్నాయి. ప్రభుత్వ విద్య హక్కులను విస్మరించి. తమకేమీ అవి పట్టవంటు వ్యవరిస్తున్నారు చివరికి ఈ సమస్యలన్నీ పాలుమార్లు రాయదుర్గం విద్యాశాఖ అధికారులకు తెలియజేసిన తమకేమి సంబంధం లేదనే లాగా తెలిసి కూడా తెలియనట్టుగా చూసి చూడనట్టుగా పరోక్షంగా ప్రైవేటు పాఠశాలలకు వృత్తాస పలుకుతున్న రాయదుర్గం విద్యాశాఖ అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ విద్యను పరిరక్షించే విధంగా ఉన్నత విద్యాశాఖ అధికారులు అడుగులు వేయాలని లేనిపక్షంలో వివరాలతో సహా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్తామని అవసరమైతే ప్రైవేట్ పాఠశాలల అక్రమ అడ్మిషన్లపై బహిరంగ లేఖలను విడుదల చేస్తామని. ముందస్తు అక్రమ అడ్మిషన్లను నియంత్రించకపోతే ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని ఉన్నత విద్యాశాఖ అధికారులకు హెచ్చరిక చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాజు మధు లింగప్ప తదితరులు పాల్గొన్నారు

Posted Under AP
Editor