వందేళ్ల భూ సమస్యకు మోక్షం: మూలగిరిపల్లి రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన మంత్రి పయ్యావుల కేశవ్!

అనంతపురం జిల్లా, రామ్ నగర్.

*వందేళ్ల భూసమస్యలకు పరిష్కారం చూపించిన మంత్రివర్యులు పయ్యావుల కేశవ్*

– *: అమిద్యాల పంచాయతీలోని మూలగిరిపల్లి గ్రామ రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు మంజూరు చేయించేందుకు మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ ప్రత్యేక కృషి*

– *రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులకి కృతజ్ఞతలు తెలియజేసిన మూలగిరిపల్లి గ్రామ రైతులు*

– *వందేళ్ల భూసమస్యలకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ పరిష్కారం చూపించారు. ఉరవకొండ మండల పరిధిలోని అమిద్యాల పంచాయతీలో ఉన్న మూలగిరిపల్లి గ్రామ రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు మంజూరు చేయించేందుకు మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ ప్రత్యేక కృషి చేశారు. ఇందులో భాగంగా మంగళవారం అనంతపురం నగరంలోని రామ్ నగర్ లో ఉన్న రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యుల క్యాంపు కార్యాలయంలో మూలగిరిపల్లి గ్రామ రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ పంపిణీ చేశారు.*

– *ఉరవకొండ మండలం, అమిద్యాల పంచాయతీలో ఉన్న మూలగిరిపల్లి గ్రామ రైతులు వంశపారంపర్యంగా, పూర్వీకుల భూములను వందేళ్ల నుంచి సాగు చేసుకుంటున్నా పట్టాదారులు పాసుపుస్తకాలు మాత్రం లేవని, ఆన్ లైన్ లో కూడా లేమని, భూసమస్యలకు పరిష్కారం చూపించాలని ఇంతకుముందు మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ దృష్టికి సమస్యను తీసుకువచ్చారు. ఈ విషయమై వెంటనే దృష్టి సారించి సంబంధిత రెవెన్యూ అధికారులతో మాట్లాడి మూలగిరిపల్లి గ్రామ రైతుల భూ సమస్యలకు పరిష్కారం చూపించేలా, వారికి పట్టాదారు పాస్ పుస్తకాలు అందించేలా తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. దీనిపై ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకుని రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు వచ్చేలా మంత్రి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. నేడు మంత్రి క్యాంపు కార్యాలయంలో పట్టాదారు పాస్ పుస్తకాలను సంబంధిత గ్రామ రైతులకు మంత్రి అందజేశారు. వందేళ్ళకిపైగా ఉన్న సమస్యను పరిష్కరించిన, తమకు పట్టాదారు పాస్ పుస్తకాలు అందజేసేందుకు కృషిచేసిన మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ కు మూలగిరిపల్లి గ్రామ రైతులు ఉమక్క, జయప్ప, ఈశ్వరయ్య, మల్లయ్య, వెంకటేశులు, బసన్న, మహేష్, తదితరులు కృతజ్ఞతలు తెలియజేస్తూ శాలువా కప్పి సన్మానించారు.*

Posted Under AP
Editor