Latest Posts

రామాపురంలో మిన్నంటిన జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకలు: పార్టీ జెండాను ఆవిష్కరించిన దూది జయరామాంజినేయులు

తాడిమర్రి(yes9tv)రామాపురం గ్రామంలో ఘనంగా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ చిలకం మధుసూదన రెడ్డి గారి ఆదేశాల మేరకు తాడిమర్రి మండలం రామాపురం గ్రామంలో జిల్లా సంయుక్త కార్యదర్శి దూది జయరామాంజినేయులు గారి ఆధ్వర్యంలో ఘనంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు.
ఈ సందర్భంగా జనసేన పార్టీ జెండాను ఆవిష్కరించి పార్టీ స్థాపన దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి స్వీట్లు పంపిణీ చేసి ఆనందం పంచుకున్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Posted Under AP
Editor