Latest Posts

కదిరిలో మోహిని అవతారంలో నరసింహస్వామి దర్శనం: భక్తులతో పోటెత్తిన పురవీధులు!

కదిరి, సత్య సాయి జిల్లా, మోహిని అలంకరణలో దర్శనమిచ్చిన శ్రీవారు, కదిరి దేవదేవుని మహోత్సవాలలో భాగంగా శనివారం మోహిని అవతారంలో కదిరి నరసింహుడు భక్తులకు దర్శనమిచ్చాడు. మోహిని అలంకార భూషితుడైన స్వామి వారు దర్శనం కోసం వేలాది మంది భక్తులు ఆత్రుతగా తండోపతండాలుగా తరలివచ్చారు. రాత్రి వేళ తిరువీధులలో జరిగే స్వామి వారి పవిత్ర ఊరేగింపు భక్తి తరంగాలను రెట్టింపు చేసింది. వేద మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల నినాదాలు, ” గోవిందా” గోవిందా” గోవిందా, అనే జయ ద్వానాలతో కదిరి పట్టణం ఆధ్యాత్మిక కాంతితో విరాజిల్లుతుంది. స్వామివారి మోహిని ఉత్సవంలో పాల్గొన్న భక్తులందరికీ YES9 టీవీ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.

Posted Under AP
Editor