Latest Posts

డిస్నీ+ హాట్‌స్టార్ పరువు తీశారంటే.. ‘పంది’తో గొడవ పడలేనంటున్న డైరెక్టర్!

ఒకప్పుడు తెలుగు దర్శకులు అలాగే నిర్మాతలు కేవలం సినిమాల వరకే పరిమితం అయ్యేవారు. కానీ ఇప్పుడు ఓటీటీలు విరివిగా పెరిగిపోతున్న నేపథ్యంలో ఓటీటీ కంటెంట్ కూడా ప్రొడ్యూస్ చేసేందుకు, డైరెక్ట్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

ఇలాంటి క్రమంలో తెలుగులో సెన్సిబుల్ డైరెక్టర్ గా మంచి ఫ్యామిలీ సినిమాలు చేస్తాడని పేరు తెచ్చుకున్న మహి వీ రాఘవ ఇటీవల సైతాన్ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకులు అందరికీ షాక్ ఇచ్చాడు. వాస్తవానికి పాఠశాల అనే సినిమాతో డైరెక్టర్ గా మారిన ఆయన తర్వాత ఆనందోబ్రహ్మ అనే సినిమాతో హిట్టు అందుకున్నాడు. ఆ సినిమా తర్వాత వైయస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో తెరకెక్కించిన యాత్ర సినిమా సూపర్ హిట్ కావడంతో సక్సెస్ఫుల్ డైరెక్టర్ల లీగ్ లోకి వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఆయన నుంచి ఎలాంటి సినిమా రాలేదు. ఈ మధ్యన ఆయన హాట్ స్టార్ కోసం సేవ్ ది టైగర్స్ అనే ఒక వెబ్ సిరీస్ రూపొందించారు.

YES9 TV