మాస్ లీడర్, ఒక్క సీన్ తో సామూహిక రాజీనామాలు

బెంగళూరు/శివమొగ్గ: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి అవకాశం కల్పిస్తూ బీజేపీ హైకమాండ్ 189 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన తరువాత ఆ పార్టీ నాయకుల్లో అసమ్మతి తారాస్థాయికి చేరింది.

మాజీ ఉప ముఖ్యమంత్రికి బీజేపీ హైకమాండ్ ఒక్కసారిగా హ్యాండ్ ఇవ్వడంతో బీజేపీ మేయర్ తో పాటు బీజేపీ కార్పోరేటర్లు సామూహిక రాజీనామాలు చెయ్యడం కలకలం రేపింది.

ఆస్కార్ అవార్డు, నాటు నాటు పాట రీమిక్స్, నాటు నాటు తీసేసి మోదీ మోదీ, అబ్బా ఏం తెలివి!

దెబ్బకు కార్పోరేషన్ లో కార్పోరేటర్ల మెజారిటీ మైనారిటీలో పడిపోయింది. కర్ణాటక మాజీ ఉప ముఖ్యమంత్రి, శివమొగ్గ బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఈశ్వరప్పకు ఈసారి పోటీ చెయ్యడానికి అవకాశం రాకపోవడంతో ఆమ్యాటర్ ముందుగానే పసిగట్టిన ఈశ్వరప్ప ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు. తాను అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చెయ్యడం లేదని కేఎస్. ఈశ్వరప్ప ముందుగానే ప్రకటించారు.

కేఎస్. ఈశ్వరప్ప ఈ విషయం మీడియాకు చెప్పిన కొన్ని గంటల తరువాత రాత్రి బీజేపీ మొదటి జాబితాను విడుదల చెయ్యడం విశేషం. బీజేపీ అధికారంలోకి రావడంతో కోసం యడియూరప్పతో కలిసి పనిచేసిన కేఎస్. ఈశ్వరప్ప లాంటి నాయకుడికి అన్యాయం జరిగిందని శివమొగ్గలో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.

నువ్వు వస్తానంటే…. నేను వద్దంటానా ?, గాలి ఇంటికి బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే!

కేఎస్. ఈశ్వరప్పకు మద్దతుగా శివమొగ్గ మహానగర పాలికే (కార్పోరేషన్ ) మేయర్ (బీజేపీ)తో పాటు బీజేపీకి చెందిన 18 మంది కార్పోరేటర్లు బుధవారం సామూహికంగా రాజీనామాలు చేసి బీజేపీ హైకమాండ్ కు నిరసన వ్యక్తం చేశారు. ఈశ్వరప్పకు టిక్కెట్ ఇవ్వాలని శివమొగ్గలోని బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. అయితే ఈ విషయంలో కేఎస్. ఈశ్వరప్ప మౌనంగా ఉండిపోయారు.

YES9 TV