Latest Posts

6093 ఖైదీ డ్రెస్‌ ఉతికించి పెట్టుకో జగన్ రెడ్డి: నారా లోకేష్

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా.. అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రజలను ప్రసన్నం చేసుకునేందుకు రెడీ అవుతున్నాయి. ఇప్పటికే టీడీపీ ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ అంటూ నిరసనలు తెలుపుతోంది. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రోడ్ షోలు నిర్వహిస్తూ.. ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు నారా లోకేష్ యువగళం పేరుతో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర నిర్వహించనున్నారు. 400 రోజులపాటు 4 వేల కిలో మీటర్లు ఆయన పాదయాత్ర సాగనుంది. పాదయాత్రకు ముందే నారా లోకేష్ విమర్శలకు పదును పెడుతున్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాడేపల్లి ప్యాలెస్‌లో ముసుగు తన్ని తొంగు

నే 50 ఏళ్ల ముసలి మూర్ఖుడు జగన్‌ రెడ్డి అంటూ ఫైర్ అయ్యారు. పరదాల మధ్య పగటికలల నుంచి బయటికి రావాలన్నారు. జగన్ రెడ్డికి తెలిసినవి మూడే విద్యలు అని.. దోచుకోవడం, దాచుకోవడం, ప్రశ్నిస్తే ప్రాణాలు తీయడమన్నారు. బారికేడ్లు అడ్డంపెట్టినా జనాలు సభల నుంచి పారిపోతుంటే.. కందకాలు తవ్విన దుర్మార్గ పాలకుడని ఆరోపించారు. ‘సీఎం సీటు కోసం తండ్రి శవం పక్కనే సంతకాలు సేకరించాడు. ఓట్లు కోసం బాబాయ్‌పై గొడ్డలి వేటు వేసి గుండెపోటని ప్రచారం చేసిన శవ రాజకీయాల బ్రాండ్‌ అంబాసిడర్‌. నీ ఓదార్పు, పాదయాత్రలకి చేసింది ఫ్రీ వెడ్డింగ్‌ షూట్లా..? మూడు తరాల మీ కుటుంబ అధికార, ధన దాహానికి నెత్తుటి సాక్ష్యాలు ఇంకా పచ్చిగానే ఉన్నాయి. రాజకీయం అంటే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమా..?

Editor