ఏపీలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌

ఏపీలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ వచ్చేసింది. ఈ ఏడాది ఆరు సబ్జెక్టులకు మాత్రమే పరీక్షలు జరగనున్నాయి.

ఏప్రిల్‌ 3 నుంచి 18 వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు బోర్డ్ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ దేవానందరెడ్డి తెలిపారు. ప్రతి రోజు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని చెప్పారు.

పరీక్షల తేదీలు..

ఏప్రిల్‌ 3న ఫస్ట్‌ లాంగ్వేజ్‌
ఏప్రిల్‌ 6న సెకండ్‌ లాంగ్వేజ్‌
ఏప్రిల్‌ 8న ఆంగ్లం
ఏప్రిల్‌ 10న గణితం
ఏప్రిల్‌ 13న సామాన్య శాస్త్రం
ఏప్రిల్‌ 15న సాంఘిక శాస్త్రం
ఏప్రిల్‌ 17న కాంపోజిట్‌ కోర్సు పరీక్ష
ఏప్రిల్‌ 18న వొకేషనల్‌ కోర్సు పరీక్ష

ఏప్రిల్‌ 17న జరిగే కంపోజిట్‌ కోర్సుల్లో ఫస్ట్‌ లాంగ్వేజ్ పేపర్‌ 2 పరీక్ష ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 11.15 గంటల వరకు 30 మార్కులకు ఉంటుంది. ఓరియంటల్ సెకండరీ స్కూల్‌ సర్టిఫికెట్‌ కోర్సుల విద్యార్థులకు సంస్కృతం, అరబిక్‌, పర్షియన్ కోర్సుల్లో ఏప్రిల్ 17వ తేదీన 100 మార్కుల పరీక్ష జరగనుంది. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షను నిర్వహిస్తారు.

అదేవిధంగా ఏప్రిల్ 18వ తేదీన ఓరియంటల్ లాంగ్వేజ్ కోర్సుల్లో భాగంగా మెయిన్ లాంగ్వేజ్ పేపర్‌ 2 పరీక్షను సంస్కృతం, అరబిక్‌, పర్షియన్ భాషల్లో నిర్వహిస్తారు. ఒకేషనల్ కోర్సుల్లో థియరీ పరీక్షలు కూడా అదే తేదీన జరగనున్నాయి.

Posted Under AP
Editor