ఆల్ ఇండియా హై కోర్ట్ లాయర్స్ క్రికెట్ టోర్నమెంట్ 2022 విన్నర్‌గా తెలంగాణ హైకోర్ట్ లాయర్స్ టీమ్ నిలిచింది. పాండిచ్చేరి వేదికగా బుధవారం తెలంగాణ హైకోర్ట్ లాయర్స్ టీమ్, అలహాబాద్ హైకోర్ట్ లాయర్స్ టీమ్స్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ ఫైనల్‌లో తెలంగాణ లాయర్స్ టీమ్ 35 పరుగుల తేడాతో అలహాబాద్ లాయర్స్ టీమ్‌ను ఓడించి టోర్నీ విజేతగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన తెలంగాణ హైకోర్ట్ లాయర్స్ టీమ్ ఇరవై ఓవర్లలో 165 పరుగులు చేసింది. 166 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగిన అలహాబాద్ లాయర్స్ టీమ్ 130 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఈ టోర్నమెంట్‌లో విజేతగా నిలిచిన తెలంగాణ హైకోర్ట్ లాయర్స్ టీమ్‌ను చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్ అభినందించారు. తెలంగాణ లాయర్స్ టీమ్‌ను పాండిచ్చేరి ముఖ్యమంత్రి విందుకు ఆహ్వానించాడు. బార్ కౌన్సిల్ చైర్మన్ నర్సింహారెడ్డితో పాటు పలువురు న్యాయవాదులు తెలంగాణ లాయర్స్ టీమ్‌కు శుభాకాంక్షలు అందజేశారు.
