Latest Posts

గుజరాత్ టైటాన్స్ జట్టు రూ.4.4 కోట్లకు జోషువాను సొంతం

ఐపీఎల్ 2023 కోసం జరుగుతున్న వేలంలో ఫ్రాంఛైజీలన్నీ ఆటగాళ్ల కోసం తీవ్రంగా పోటీ పడుతున్నాయి. ఇప్పటికే స్టార్ ఆటగాళ్లను కొనుగోళ్లు దాదాపు ముగియడంతో అన్ క్యాప్డ్, సీనియర్ ఆటగాళ్ల కోసం చూస్తున్నారు. ఈ వేలంలో ఓ ఆటగాడు చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్‌లో ఆడబోతున్న మొదటి ఐర్లాండ్ ప్లేయర్‌గా జోషువా రికార్డు సాధించాడు. గుజరాత్ టైటాన్స్ అతడిని రూ.4.4 కోట్లకు కొనుగోలు చేసింది. గతేడాది వరకు చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో నెట్ బౌలర్‌గా ఉన్న జోషువా.. అతి కొద్ది సమయంలోనే పొట్టి ఫార్మాట్‌లో బెస్ట్ బేసర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవల ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌లో తన ప్రదర్శనతో ఫ్రాంఛైజీ ఓనర్లను ఆకర్షించాడు. ఫలితంగా ఈ మినీ వేలంలో అతడు భారీ మొత్తానికి అమ్ముడుపోయాడు.

గుజరాత్ టైటాన్స్ జట్టు రూ.4.4 కోట్లకు జోషువాను సొంతం చేసుకుంది. 23 ఏళ్ల జోషువా.. అంతర్జాతీయ టీ20ల్లో 39 వికెట్లు పడగొట్టాడు. టీ20 ప్రపంచకప్ 2022లో న్యూజిలాండ్‌తో జరిగిన సూపర్ 12 మ్యాచ్‌లో హ్యాట్రిక్ వికెట్లు తీసి రికార్డు సృష్టించాడు. ఫలితంగా అందరి కళ్లు అతడిపై పడ్డాయి. గతంలో ఐర్లాండ్‌ తరఫున ఆడిన మోర్గాన్ ఐపీఎల్‌లో ఆడినప్పటికీ.. అతడు ఇంగ్లాండ్‌కు వలస వెళ్లడంతో జోషువా లిటిల్ ఈ రికార్డు క్రియేట్ చేశాడు. శుక్రవారం జరిగిన ఐపీఎల్ వేలంలో జోషువా లిటిల్ కోసం ఫ్రాంఛైజీల మధ్య పోటీ తీవ్రంగా నడిచింది. గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య పోటీ తీవ్రంగా నెలకొంది. ఇరు ఫ్రాంఛైజీలు ఎవ్వరూ తగ్గకపోవడంతో అతడి ధర భారీగా పెరిగింది. అయితే ఈ లేఫ్ట్ ఆర్మ్ పేసర్ కోసం చివరి వరకు పోటీ పడిన గుజరాత్ జట్టే సొంతం చేసుకుంది. రూ.4.4 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. ఫలితంగా ఐపీఎల్ కాంట్రాక్ట్ చేసుకున్న మొదటి ఐరీష్ ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు.

Editor