ఏ పనైనా కష్టంతో కూడా ఇష్టంతో చేయాలంటారు పెద్దలు. టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఇదే సూత్రాన్ని ఫాలో అవుతోంది. ఫిట్ నెస్ విషయంలో ఈ హీరోయిన్ ను మించిన ఇతర హీరోయిన్స్ ఎవరు లేరనే చెప్పొచ్చు. ఏమాత్రం సమయం దొరికినా జిమ్ లో దూరుతూ.. ఏ రేంజ్ లో వర్కౌట్స్ చేస్తుంటుంది ఈ బ్యూటీ. అంతేకాదు.. తన ఫ్రెండ్స్ కు ఫిట్ నెస్ సలహాలు ఇస్తోంది. రకుల్ ప్రీత్ సింగ్ లేటెస్ట్ వర్కౌట్ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఆ వీడియో ఇటు నెటిజన్స్, అటు ఫిట్ నెస్ లవర్స్ ను ఆకట్టుకుంటోంది.
రకుల్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా తన డైలీ లైఫ్ కు సంబంధించిన విషయాలను ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటుంది. ఇటీవల రకుల్ జిమ్‌లో వర్కౌట్ చూసిన వీడియోను షేర్ చేసింది. ఆమె తన పోస్ట్‌కి ‘ఆదివారం బాగా ఎక్సర్ సైజ్ చేయడం జరిగింది’ అని క్యాప్షన్ ఇచ్చింది. రకుల్ తన రాబోయే ప్రాజెక్ట్‌లు జగత్ జెంట్రీ, ఇండియన్ 2, అయాలాన్ తో పాటు, మరికొన్ని చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కేవలం బాడీ షేప్ కోసమే కాకుండా నేచర్ గడిపేందుకు, కొన్ని చెమట చుక్కలు చిందించేందుకు కూడా రన్నింగ్, వాకింగ్ చేయాలని చెబుతోంది రకుల్. వ్యాయమాన్ని రోజువారి జీవితంలో భాగం చేసుకోవాలని చెబుతోంది.
