- హామీ పరిష్కారానికి మొదటి సంతకం..
- అహమ్మద్ నగర్ బ్రిడ్జి వెడల్పు ప్రతిపాదనపై సంతకం
హిందూపురం మున్సిపల్ చైర్మన్ పిఎస్. మంజునాథ్ బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు తన మొదటి సంతకంగా పట్టణంలోని అహ్మద్ నగర్ నుంచి బాలాజీ నగర్ ప్రాంతాల మధ్య నివసిస్తున్న మైనారిటీ ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని హనుమాన్ గుడి వద్ద ఉన్న కట్ట కాలువపై బ్రిడ్జి నిర్మాణం, ప్రస్తుతం ఉన్న బ్రిడ్జి వెడల్పు పెంపునకు సంబంధించిన ప్రతిపాదనపై మొదటి సంతకం చేశారు.
ప్రస్తుతం ఉన్న బ్రిడ్జి వెడల్పు రాకపోకలకు సరిపోకపోవడం తో ఆ ప్రాంతం రోజురోజుకూ అభివృద్ధి చెందుతూ జనాభా వాహనాల రాకపోకలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేందుకు అవసరమైన బ్రిడ్జి నిర్మాణానికి అంచనాలు రూపొందించి పరిపాలనా అనుమతులు పొందిన అనంతరం పనులు ప్రారంభించాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు.
అలాగే గతంలో ఎమ్మెల్యే బాలకృష్ణ చొరవతో మంజూరైన రూ.5 కోట్ల నిధులకు సంబంధించి పట్టణంలోని SC ప్రాంతాలలో మౌలిక సదుపాయాల కల్పన తో పాటు అభివృద్ధి పనుల నిమిత్తంరూ. 3.48 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న 23 అభివృద్ధి పనులకు సంబంధించిన టెండర్లను ఆమోదించారు. అభివృద్ధి పనులు గతిన చేపట్టాల్సిందిగా అధికారులకు ఆదేశించారు.
