వేముగోడు అభివృద్ధే లక్ష్యం.. స్రవంతికి ఒక్క అవకాశం ఇవ్వండి..

  • వేముగోడు అభివృద్ధే లక్ష్యం.. స్రవంతికి ఒక్క అవకాశం ఇవ్వండి..! యువతి నాయకత్వంతో గ్రామానికి కొత్త దిశ.. కత్తెర గుర్తుకు మద్దతుగా ప్రచార హోరు
  • యువతకు అవకాశం కల్పిస్తేనే గ్రామాభివృద్ధి సాధ్యం.. స్రవంతి..!

గోనెగండ్ల, నవంబర్ 25 ప్రభావం న్యూస్

గోనెగండ్ల మండలంవేముగోడు గ్రామంలో ఎన్నికల వేడి రాజుకుంది. కూటమి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి స్రవంతి ఎన్నికల ప్రచారం హోరెత్తింది. నాయకులు, కార్యకర్తలు, యువత భారీగా తరలిరావడంతో గ్రామంలో ప్రచార సందడి నెలకొంది. ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుసుకుంటూ కత్తెర గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని స్రవంతి అభ్యర్థించారు.

ఈ సందర్భంగా స్రవంతి మాట్లాడుతూ.. గ్రామాభివృద్ధికి యువతకు, చదువుకున్న వారికి అవకాశం కల్పించాలని కోరారు. ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి ఆశీస్సులతో వేముగోడు గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామ ప్రజలు తనకు ఒక్క అవకాశం ఇచ్చి కత్తెర గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

మాజీ సర్పంచ్ సత్యనారాయణ స్వామి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో గ్రామాలు అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయని, అదే అభివృద్ధి వేముగోడులోనూ కొనసాగాలంటే స్రవంతికి ప్రజలు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.

ఈ ప్రచార కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సత్యం స్వామి కుమారుడు సాయి, ఎంపీటీసీ అప్పన్నతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Posted Under AP
Editor