Latest Posts

పోరుమామిళ్లలో హోరెత్తిన సర్పంచ్ ఎన్నికల ప్రచారం.. వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థి షేక్ సునీహాకు మద్దతుగా నల్లేరు విశ్వనాథరెడ్డి భారీ ర్యాలీ!

ఎస్ 9 టీవీ సెంటర్…. పోరుమామిళ్ల జిల్లా…. కడప తేదీ …. 25-11-2026 రిపోర్టర్…..గురుస్వామి సర్పంచ్ ఎన్నికల ప్రచారం చివరిరోజు కావడంతో కడప జిల్లాలోని పోరుమామిళ్ల పట్టణం ర్యాలీలతో, ప్రచారాలతో హోరెత్తిపోయింది. బద్వేల్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపి నల్లేరు విశ్వనాధరెడ్డి బలపరుస్తున్న సర్పంచ్ అభ్యర్థి షేక్ సునీహాను గెలిపించాలంటూ… వేలమంది ప్రజలు కార్యకర్తలు పట్టణంలోని వెంకటేశ్వర స్వామి గుడి వద్ద నుంచి గాంధీ సర్కిల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. వైఎస్ఆర్సిపి జిందాబాద్, జై జగన్ అనే నినాదాలతో పట్టణంలోని ప్రధాన రహదారి దద్దరిల్లిపోయింది. ఈ సందర్భంగా నల్లేరు విశ్వనాథరెడ్డి మాట్లాడుతూ… పంచాయతీ ప్రజలు మాకు ఒక్క అవకాశం ఇచ్చి చూడండి, పంచాయతీని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తాం, సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దామన్నారు. కప్పు, సాసర్ గుర్తుపై ఓటు వేసి షేక్ సునీహను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

Posted Under AP
Editor