కదిరి ఇటీవల మన్యం జిల్లాలో ఈనెల 21 నుండి 23 వరకు జరిగిన 70వ ఎస్.జి.ఎఫ్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ రాష్ట్ర స్థాయి కరాటే పోటీల్లో కదిరికి చెందిన శ్రీ శాంతినికేతన్ పాఠశాల విద్యార్థి మహమ్మద్ కైఫ్ గోల్డ్ మెడలను సాధించి డిసెంబర్ నెల లో పంజాబ్ రాష్ట్రం లుధియానా లోజరిగే జాతీయస్థాయి పోటీలకు కూడా ఎంపికయ్యారు ఈ సందర్భంగా శ్రీ శాంతినికేతన్ పాఠశాల విద్యాసంస్థ అధినేత మోమిన్ సలీం భాషా మహమ్మద్ కైఫ్ ను అభినందించారు. సలీం భాషా మాట్లాడుతూ విద్యార్థులందరూ కూడా కరాటే నేర్చుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉందని తెలియజేశారు ముఖ్యంగా బాలికలు తమ ఆత్మరక్షణ కోసం తప్పనిసరిగా నేర్చుకోవాలని కూడా ఆయన సలహా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉపాధ్యాయులు మహమ్మద్ కైఫ్ నీ అతనికి శిక్షణ ఇచ్చిన మాస్టర్ షాకీర్ కీ అభినందనలు తెలియజేసారు.
