- వైస్ చైర్మన్ పదవి ముస్లింల ఆత్మగౌరవం!
- మునిసిపల్ వైస్ చైర్మన్ స్థానం ముస్లిం మైనార్టీ ఇవ్వాలి..
హిందూపురం:
హిందూపురంలో మున్సిపల్ వైస్ చైర్మన్ పదవిపై ముస్లిం ఐక్యవేదిక గళమెత్తింది. వైస్ చైర్మన్ పదవి ముస్లింల ఆత్మగౌరవానికి ప్రతీక అంటూ ముస్లిం మౌలానాలు ,మత పెద్దలు, ఐక్యవేదిక ప్రతినిధులు తమ డిమాండ్‌ను తెరపైకి తీసుకొచ్చారు. జామియా మసీదు పెద్దలు, మౌలానాలు కలిసి ముస్లిం సమాజానికి వైస్ చైర్మన్ పదవి కేటాయించాలని కోరారు. ఈ మేరకు చైర్పర్సన్ మంజునాథ్‌తో పాటు ఎమ్మెల్యే వ్యక్తిగత కార్యదర్శి శ్రీనివాసరావుకు తమ విజ్ఞప్తిని అందజేశారు.
హిందూపురం మున్సిపల్ రాజకీయాల్లో వైస్ చైర్మన్ పదవి అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది.వైస్ చైర్మన్ పదవి ముస్లింల ఆత్మగౌరవం అనే నినాదంతో జామియా మసీదు పెద్దలు, మౌలానాలు, ముస్లిం ఐక్యవేదిక ప్రతినిధులు తమ అభ్యర్థనను వినిపించారు.గత సంప్రదాయాలను కొనసాగిస్తూ హిందూపురం మున్సిపల్ వైస్ చైర్మన్ పదవిని ముస్లిం సమాజానికి కేటాయించాలని వారు కోరుతున్నారు. ముస్లిం సమాజానికి రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడంతో పాటు వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలా నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో ముస్లిం ఐక్యవేదిక పెద్దలు, జామియా మసీదు ప్రతినిధులు, మౌలానాలు కలిసి చైర్పర్సన్ మంజునాథ్‌కు, వ్యక్తిగత కార్యదర్శి శ్రీనివాసరావుకు తమ అభ్యర్థనను తెలియజేశారు.ఇది కేవలం పదవి కోసం చేస్తున్న అభ్యర్థన మాత్రమే కాదని, హిందూపురంలో 40% కౌన్సిలర్లు ఉన్నారని ముస్లిం సమాజ గౌరవానికి సంబంధించిన అంశమని ఐక్యవేదిక ప్రతినిధులు పేర్కొంటున్నారు. 2029లో సాధారణ ఎన్నికలున్నాయని వాటిని కూడా దృష్టిలో ఉంచుకొని ముస్లిం మైనార్టీలకు సముచిత స్థానం కల్పించాలని ముక్తకంఠంతో హెచ్చరించారు. సమావేశంలో
