అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపిస్తా…
గోవిందవాడ సర్పంచ్ అభ్యర్థి వన్నూరుస్వామి
బొమ్మనహాల్ నవంబర్ 16 YES 9 TV News
గ్రామ ప్రజలు తనపై నమ్మకంతో అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే గ్రామానికి మరిన్ని నిధులు తీసుకొచ్చి అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తానని బొమ్మనహాళ్ మండలం గోవిందవాడ గ్రామ సర్పంచ్ అభ్యర్థి వన్నూరుస్వామి పేర్కొన్నారు. గ్రామ ప్రజల ఆశీస్సులు, ఆదరణతో సర్పంచ్‌గా ఎన్నికైతే గ్రామ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ముఖ్యంగా తాగునీరు, రహదారులు, పారిశుద్ధ్యం, వీధి దీపాలు, మురుగు కాలువలు వంటి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా కృషి చేస్తానని తెలిపారు. గ్రామానికి అవసరమైన అభివృద్ధి నిధులను వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా తీసుకొచ్చేందుకు నిరంతరం శ్రమిస్తానన్నారు. పదవిని అధికారంగా కాకుండా ప్రజలకు సేవ చేసే అవకాశంగా భావిస్తానని పేర్కొన్నారు. గ్రామంలోని ప్రతి కుటుంబానికి అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలను పరిష్కరిస్తానని, తనకు ఒక అవకాశం కల్పించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వన్నూరుస్వామి గ్రామ ప్రజలను కోరారు.
