హిందూపురంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల సందడి

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల సమరంలో భాగంగా హిందూపురం మండల పరిధిలోని ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. డీఆర్‌సీ కేంద్రాల వద్ద బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పత్రాలు, ఇతర పోలింగ్ సామగ్రిని క్షుణ్ణంగా తనిఖీ చేసుకున్న ప్రిసైడింగ్ అధికారులు, పోలింగ్ సిబ్బంది కేటాయించిన ప్రత్యేక వాహనాల్లో తమతమ పోలింగ్ కేంద్రాలకు బయలుదేరి వెళ్లారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సమస్యాత్మక ప్రాంతాల్లో పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు, ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా తగిన సదుపాయాలు కల్పించారు.

 

Editor