సమస్యల పరిష్కారమే నా లక్ష్యం.. రాజీ పడే ప్రసక్తే లేదు: బీజేపీ ఎంపీటీసీ అభ్యర్థి ముఖాముఖి!

YES 9 TV News

ప్రజలకు మాటలు చెప్పి ఓట్లు అడగడం నా ఉద్దేశం కాదు. సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు కృషి చేస్తాను.

ఎంపీటీసీగా గెలిచిన తర్వాత సమస్యల కోసం నిలబడగలరా?

అభ్యర్థి సమాధానం:

ప్రజలు నాపై పెట్టుకున్న నమ్మకమే నాకు ముఖ్యం. ప్రజల మాటిస్తున్న మాట ప్రకారం నిలబడతా, ఏ విషయంలో రాజీ పడను.ప్రజల ఆశీస్సులు ఉంటే చాలు.

ఎన్నికల్లో ఇంటింటికి వెళ్లి హామీలు ఇస్తున్నారు. గెలిచిన తర్వాత ప్రజలకు అందుబాటులో లేకపోతే మిమ్మల్ని ప్రజలు ఎలా ప్రశ్నించాలి?

అభ్యర్థి సమాధానం:

ప్రజలకు అందుబాటులో ఉండటమే నా బాధ్యత. ప్రతి నెలా గ్రామంలో ప్రజలతో సమావేశం నిర్వహించి సమస్యలు తెలుసుకుంటాను. నా పనితీరుపై ప్రజలకు ప్రశ్నించే హక్కు ఉంటుంది. ఇచ్చిన హామీల అమలుపై ప్రజలకు

రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై మీ కార్యాచరణ ఏమిటి?

అభ్యర్థి సమాధానం:

రైతుల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతాను. అన్ని సమస్యల్లో రైతులకు అండగా ఉంటాను. రైతులకు ప్రభుత్వ పథకాలు అందేలా చేస్తాను.

యువతకు, మహిళలకు మీ వద్ద ఎలాంటి ప్రణాళిక ఉంది?

అభ్యర్థి సమాధానం:
యువతకు నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పించేందుకు కృషి చేస్తాను. మహిళా సంఘాలకు స్వయం ఉపాధి అవకాశాలు అందేలా సంబంధిత శాఖలతో మాట్లాడతాను. అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలు అందేలా సహకరిస్తాను.
మీరు బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు గ్రామీణ ప్రజలకు చేరేలా చేయడంలో ఎంపీటీసీగా మీ పాత్ర ఏమిటి?

అభ్యర్థి సమాధానం:
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అమలయ్యే పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా కృషి చేస్తాను. గ్రామానికి సంబంధించిన సమస్యలను ఎంపీపీ, జడ్పీటీసీ, అధికారుల దృష్టికి తీసుకెళ్తాను. ఐదేళ్ల తర్వాత చేసిన పనులు, పరిష్కరించిన సమస్యలు, సాధించిన అభివృద్ధి వివరాలతో ప్రజల ముందుకు వస్తాను.

Editor