కులమతాలకు అతీతంగా ఘనంగా దర్గా షర్మస్త్ వలి ఉరుసు

 

బొమ్మనహాల్ అక్టోబరు YES 9 టీవీ న్యూస్:

 

మండలం దర్గా హోన్నూరు గ్రామంలో ప్రసిద్ధి చెందిన హజరత్ షర్మస్త్ వలి దర్గా ఉరుసు ఉత్సవాలు శనివారం అత్యంత వైభవంగా, ప్రశాంత వాతావరణంలో జరిగాయి. కులమతాలకు అతీతంగా నిర్వహించిన ఈ ఉత్సవాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.ఉత్సవాల్లో భాగంగా శనివారం వేకువజామున గుర్రం సవారీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. హోన్నల్లి గ్రామం నుంచి సంప్రదాయబద్ధంగా ప్రారంభమైన గుర్రం సవారీ దర్గా హోన్నూరు గ్రామానికి చేరుకుంది. అనంతరం దర్గా వద్ద పెద్దల సమక్షంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు భక్తిశ్రద్ధలతో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.ఈ ఉరుసు వేడుకలకు వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చి దర్గాను దర్శించుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. దర్గా పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి. కులమతాలకు అతీతంగా భక్తులు ఐక్యత, సోదరభావంతో ఉత్సవాల్లో పాల్గొనడం విశేషంగా నిలిచింది.భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చిన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు శాఖ పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. సీఐ నాయకత్వంలో మండల ఎస్సై నభీరసూల్ తన సిబ్బందితో కలిసి దర్గా పరిసర ప్రాంతాల్లో భారీ పోలీసు బందోబస్తు నిర్వహించారు. పోలీసుల పర్యవేక్షణలో ఉరుసు వేడుకలు ప్రశాంతంగా ముగిశాయి.

Posted Under AP
Editor