షియోమీ కొత్తగా విడుదల చేసిన Xiaomi 18 Pro, 18 Pro Max స్మార్ట్‌ఫోన్ల కోసం వినూత్న యాక్సెసరీని తీసుకొచ్చింది. ‘Xiaomi Pocket Guitar’ పేరుతో వచ్చిన ఈ యాక్సెసరీ ఫోన్ వెనుక భాగంలోని సెకండరీ డిస్‌ప్లేను ఉపయోగించుకునేలా రూపొందించారు. బ్లాక్, రెడ్ రంగుల్లో లభించే దీన్ని బలమైన మాగ్నెట్ సాయంతో ఫోన్ వెనుక భాగానికి అమర్చుకోవచ్చు.
ఫోన్‌కు అమర్చినప్పుడు ఈ యాక్సెసరీ సెకండరీ డిస్‌ప్లేను కవర్ చేస్తుంది. తెరిచినప్పుడు మధ్యలోని హింజ్ చుట్టూ రెండు భాగాలుగా విడిపోతుంది. ఒక వైపు I నుంచి VII వరకు నంబర్లతో కూడిన కార్డ్ బటన్లు ఉండగా.. మరోవైపు గిటార్ స్ట్రింగ్స్‌ను పోలిన రిడ్జ్‌లతో టెక్స్చర్డ్ ప్యానెల్ ఉంటుంది.
Xiaomi Pocket Guitarను సంగీతం కోసం మాత్రమే కాకుండా మరో విధంగానూ ఉపయోగించుకోవచ్చు. దీన్ని వెనుక వైపుకు మడిచినప్పుడు చిన్న ఫోన్ స్టాండ్‌గా కూడా ఉపయోగించుకునేలా డిజైన్ చేశారు. దీంతో Xiaomi 18 Pro సిరీస్ ఫోన్ల కోసం ఈ యాక్సెసరీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
