కాంగోలో ఘోర విమాన ప్రమాదం.. ఇద్దరు సీనియర్ సైనిక అధికారులతో సహా 14 మంది మృతి

కాంగోలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. విమానం కూలిపోవడంతో ఇద్దరు సీనియర్ సైనిక అధికారులతో సహా కనీసం 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని కాంగో సైన్యం శుక్రవారం వెల్లడించింది. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

మృతుల్లో మిలిటరీ కోర్టు అధిపతి లెఫ్టినెంట్ జనరల్ ముటోంబో కటలాయి టియెండే, సాయుధ దళాల ఆడిటర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ బకుమి లికులియా ఉన్నారు. విధుల్లో భాగంగా ప్రయాణిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు సైనిక వర్గాలు తెలిపాయి.

వీరితో పాటు ప్రతినిధి బృందానికి చెందిన మరో 12 మంది, విమాన సిబ్బంది కూడా ప్రమాదంలో మృతి చెందినట్లు సమాచారం. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.

Editor