అంబేద్కర్ ఇండియా మిషన్ జిల్లా సోషల్ మీడియా అధ్యక్షుడిగా గుట్ట గోపాల్..

అంబేద్కర్ ఇండియా మిషన్ జిల్లా సోషల్ మీడియా అధ్యక్షుడిగా గుట్ట గోపాల్
ముదిగుబ్బ, ప్రజాశక్తి: అంబేద్కర్ ఇండియా మిషన్ శ్రీ సత్యసాయి జిల్లా సోషల్ మీడియా అధ్యక్షుడిగా పాత్రికేయుడు గుట్ట గోపాల్ నియమితులయ్యారు. సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు పి.వి. సునీల్ కుమార్ ఐపీఎస్ సూచనల మేరకు రాష్ట్ర సోషల్ మీడియా వర్కింగ్ ప్రెసిడెంట్ రాజశేఖర్ జల్లి ఆధ్వర్యంలో ఈ నియామకం జరిగింది.
ఈ సందర్భంగా గుట్ట గోపాల్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. సంస్థ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు సామాజిక న్యాయం, సమానత్వం, బహుజన సాధికారత కోసం తన వంతు కృషి చేస్తానన్నారు. ఈ అవకాశం కల్పించిన పి.వి. సునీల్ కుమార్ ఐపీఎస్, సీఐ రమేష్ నాయుడు, రాజశేఖర్ జల్లి, ఉమ్మడి అనంతపురం జిల్లా ఎయిమ్ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Posted Under AP
Editor