ముదిగుబ్బ: శ్రీ సత్యసాయి వాటర్ సప్లయ్ ప్రాజెక్టులో పనిచేస్తున్న 570 మంది కార్మికులకు ఐదు నెలలుగా బకాయి ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని కోరుతూ సీపీఎం, సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు శనివారం పంచాయతీ, ఎంపీడీవో, తహసీల్దార్ కార్యాలయాల్లో వినతిపత్రాలు అందజేశారు.
బకాయి వేతనాలను ఆగస్టు 31లోపు చెల్లించాలని, లేనిపక్షంలో సెప్టెంబర్ 1 నుంచి విధులు బహిష్కరించి సమ్మెలోకి వెళ్తామని సమ్మె నోటీసులో పేర్కొన్నారు. అలాగే మృతిచెందిన, రిటైర్డ్ కార్మికులకు గ్రాట్యుటీ చెల్లించాలని, ప్రాజెక్టుకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించి కార్మికులకు సకాలంలో వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సత్యసాయి వాటర్ కార్మికులు, సీపీఎం, సీఐటీయూ నాయకులు పాల్గొన్నారు.
