Latest Posts

శ్రీ సత్యసాయి జిల్లాలో బొలెరో దొంగల ముఠా హల్చల్: పోలీసులపైకే వాహనంతో దాడి… సీఐ మూడు రౌండ్ల కాల్పులు!

శ్రీ సత్య సాయి జిల్లా
సెంటర్ హిందూపురం

శ్రీ సత్య సాయి జిల్లా.హిందూపురం ప్రాంతంలో దొంగల ముఠా హల్చల్ చేసింది.మళ్లీ బొలెరో దొంగల ముఠా పోలీసులపై తిరగబడింది.హిందూపురం ప్రాంతంలో బొలెరో వాహనంలో కొంతమంది దుండగులు వచ్చి అనుమానాస్పదంగా పెరుగుతున్నట్లు సమాచారంతో అలర్ట్ అయిన పోలీసులు అర్ధరాత్రి మేళాపురం క్రాస్ లో వేగంగా వస్తున్న ఒక బొలెరో వాహనాన్ని ఆపబోయారు పోలీసులు. వాహనాన్ని ఆపకుండా వెళ్లిపోయిన దొంగల ముఠా. గంటపాటు పోలీసులు బొలెరో వాహనం వెనుక ముందు చేజ్ చేశారు. పరిగి మండలం ఊటుకూరు వద్ద దొంగల ముఠా పోలీసులు పైకి రావడంతో రూరల్ సీఐ జనార్ధన్ ఒక్కసారిగా మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. అయినప్పటికీ వెనక్కి తగ్గని దొంగలు పోలీసుల కళ్ళు కప్పి పరారయ్యారు. వెంటనే తేరుకున్న రూరల్ సీఐ జనార్ధన్ పావుగడ వైపు వెళ్లిందన్న సమాచారం తెలుసుకొని 50 కిలోమీటర్ల మేర గాలింపు చర్యలు చేపట్టిన ఫలితం లేకపోయింది.రెండు గంటల పాటు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టిన దొంగల ముఠా జాడ కనిపెట్టలేకపోయారు పోలీసులు…కర్ణాటక కు చెందిన ఈ ముఠా గత నెల రోజులుగా పందులను ఎత్తుకెళ్లేందుకు తిరుగుతున్న ముఠా గా అనుమానిస్తున్న పోలీసులు..
ఈ నెల 7 న హిందూపురం శివారులో తనిఖీలు నిర్వహిస్తుండగా బొలెరో వాహనంలో వెళుతున్న దొంగలు పోలీసు వాహనాన్ని ఢీ కొట్టి పరారయ్యారు పెనుకొండ, మడకశిర, పరిగి మీదుగా పావుగడ వైపు దుండగుల వాహనం వెళ్లినట్లు అనుమానిస్తున్న పోలీసులు
అయితే ఈ ముఠా ఎవరు? ఏ నేరాలకు పాల్పడుతున్నారు? వారి లక్ష్యం ఏమిటన్నది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.

బైట్స్. జనార్ధన్ హిందూపురం రూరల్ సిఐ

Posted Under AP
Editor