అనంతపురం జిల్లా-కళ్యాణదుర్గం
ఫైల్ నేమ్:- ATP-KLD 28-08-2026 చెట్లకు రాఖీ కట్టిన విద్యార్థులు
చెట్లే ప్రకృతికి రక్ష వాటికి రక్షణగా రాఖీలు
అనంతపురం జిల్లా కుందుర్పి మండలం అపిలేపల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థులు వినూత్న కార్యక్రమం.
అన్నాచెల్లెళ్ల ఆత్మీయతకు, రక్షణకు ప్రతీకగా
ప్రతి ఏటా రాఖీ పండుగ జరుపుకొంటారు. పవిత్రమైన రక్షాబంధన్ వేడుకలను
మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల అపిలేపల్లి విద్యార్థులు ఒక వినూత్న ఆలోచనతో పాఠశాలలో జరుపుకున్నారు.
మనకు నిత్యం ప్రాణవాయువును అందిస్తూ, పర్యావరణాన్ని కాపాడుతున్న చెట్లకు రాఖీలు కట్టి వాటిని రక్షించాలనే సందేశాన్ని సమాజానికి తల్లిదండ్రులకు అందించారు.
పాఠశాల ఆవరణలోని ఉసిరి టేకు, మామిడి, కొబ్బరి, మహాగని మేడి, వెలగ, చింత వక్క సరుగుడు బాదం చెట్ల చుట్టూ విద్యార్థులు చేరి వాటిని వారి కుటుంబ సభ్యులగా భావించి వాటికి కుంకుమ బొట్లు పెట్టి నీళ్లు పోసి రాఖీలు కట్టడం జరిగింది.మొక్కలను కాపాడుకోవడం అంటే మన భవిష్యత్తును మనమే కాపాడు కోవడమే అనే నినాదంతో పర్యావరణ పరిరక్షణపై తోటి విద్యార్థులకు అవగాహన కల్పించారు.
విద్యార్థులు మొక్కలకు నీరు పోయడం, వాటిని సంరక్షించడం పండుగలు జాతర్ల పేరుతో చెట్లను నరికివేయకుండా చూడడం, పుట్టినరోజు నాడు మాతృదినోత్సవం నాడు అమ్మకు గుర్తుగా మరిన్ని మొక్కలు నాటడం వంటి కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని ప్రతిజ్ఞ చేశారు.
ఈ వినూత్న రాఖీ వేడుకలో సీనియర్ ఉపాధ్యాయులు బొమ్మయ్య మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థులలో ప్రకృతి పట్ల మొక్కల పట్ల ప్రేమ, అనుబంధం ఏర్పడుతుంది అన్నారు. అదే విధంగా మనుషుల మధ్యే కాకుండా మనిషికి ప్రకృతికి మధ్య కూడా అవినాభావ సంబంధం ఉండాలని చాటి చెప్పారు.
ఇలాంటి కార్యక్రమాల ద్వారా చిన్నారుల్లో పర్యావరణ పరిరక్షణ పట్ల బాధ్యతను పెంపొందించడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమం లో పాఠశాల ప్రధానోపాధ్యాయులు హనుమంత రాయుడు ఉపాధ్యాయ బృందం నాగేశ్వరి సురేష్ లోకేష్ రాజా పాల్గొన్నారు.
