యువనేత నారా లోకేశ్ రాయదుర్గం నియోజకవర్గ పర్యటనకు టీడీపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు.
రాయదుర్గం పట్టణంలో 15 వేల మందికి తగ్గకుండా నాయకులు, కార్యకర్తలు, ప్రజలతో ఘన స్వాగతానికి సన్నాహాలు.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత లోకేశ్ తొలిసారిగా రాయదుర్గం రావడం ప్రత్యేకత.
లోకేశ్ పర్యటనను టీడీపీ బలం, బలగాన్ని చాటుకునే సువర్ణావకాశంగా భావిస్తున్న పార్టీ శ్రేణులు.
పార్టీ కార్యక్రమంతో పాటు కనేకల్లు క్రాస్ వద్ద సుజలానా ప్రైవేట్ కంపెనీ ప్రాజెక్టుకు శంకుస్థాపన.
రోజంతా నియోజకవర్గంలోనే ఉండనున్న లోకేశ్.. వేలాది మంది కార్యకర్తలను కలవనున్నారు.
కార్యకర్తలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు, నియోజకవర్గ అవసరాలను తెలుసుకోనున్న లోకేశ్.
రాయదుర్గం అభివృద్ధిపై లోకేశ్ ప్రత్యేక దృష్టి పెట్టారని టీడీపీ నాయకుల వెల్లడి.
విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాయదుర్గంలో 21 హైస్కూళ్ల అప్‌గ్రేడ్.
దీంతో నియోజకవర్గంలో హైస్కూళ్ల సంఖ్య 72కు చేరిందని నాయకుల వెల్లడి.
జిల్లాలో 748 ఉపాధ్యాయ పోస్టులు మంజూరైతే రాయదుర్గానికి 246 పోస్టులు కేటాయింపు.
అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ పోస్టుల్లోనూ రాయదుర్గానికి పెద్దపీట వేశారని పేర్కొన్న నాయకులు.
‘మనబడి–మన భవిష్యత్తు’ కార్యక్రమంలో జిల్లాలో ఎంపికైన 372 పాఠశాలల్లో రాయదుర్గానికి 94 పాఠశాలలు.
జిల్లావ్యాప్తంగా రూ.360 కోట్ల పనులు జరుగుతుండగా రాయదుర్గంలోనే సుమారు రూ.92 కోట్ల పనులు జరుగుతున్నాయని వెల్లడి.
పేదలు, బడుగు బలహీన వర్గాలు, వలస కార్మికులు అధికంగా ఉన్న రాయదుర్గంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని నాయకుల వ్యాఖ్య.
చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో నియోజకవర్గంలో నిలిచిపోయిన అభివృద్ధి పనులను తిరిగి ప్రారంభించామని వెల్లడి.
లోకేశ్‌కు ఘన స్వాగతం పలికేందుకు రైతులు, మహిళలు, యువత, బడుగు బలహీన వర్గాలు పెద్దఎత్తున తరలిరావాలని టీడీపీ నాయకుల పిలుపు.
బైట్స్. కాలవ శ్రీనివాసులు, ప్రభుత్వ విప్, రాయదుర్గం శాసనసభ్యులు-
