మలకవేమల పరిధి గ్రామాలకు హంద్రీనివా జలాలు విడుదల హర్షం వ్యక్తం చేసిన రైతున్నలు

ముదిగుబ్బ మండలం, మలకవేమల,సానే వారిపల్లి, ఎనుములవారిపల్లి పరిధిలో ఉన్న బెల్లపల్లి కుంట (చెరువు)కు హంద్రీనీ జలాలు చెరువులకు వదలడంతో ఆయా గ్రామాల రైతులు హర్షం వ్యక్తం చేశారు.
మలకవేమల గ్రామ కార్యదర్శి బండి మల్లికార్జున మాట్లాడుతూ మండల రైతుల కష్టాలు, తీవ్ర వర్షాభావ పరిస్థితులను ఉన్నతాధికారుల దృష్టికి పలుమార్లు తీసుకు వెళ్లి, హంద్రీనివా నీళ్లను రైతుల పొలాలకు మళ్ళించేలా కృషి చేసిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు,అలాగే సమస్య పట్ల అత్యంత చొరవ తో పరిష్కారాన్ని చూపిన ధర్మవరం తెలుగుదేశం పార్టీ నియోజక వర్గ ఇంచార్జ్ పరిటాల శ్రీ రామ్ కు రైతులు కార్యకర్తలు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుత నీటి మళ్లీంపు తో రైతులకు,పాడి పరిశ్రమ పెంపకదారులకు ఉపశమనం కలుగుతుందని రైతులు సంతోషం వ్యక్తం చేశారు. ఎల్ ని నో ప్రభావం ఉన్న ఈ విపత్కర పరిస్థితిలో హంద్రీనీవా నదీ జలాలు రైతులకు సాగునీటి బోర్లలో నీటిమట్టం పెరుగుతుందని రైతులు అభిప్రాయపడుతున్నారు. అలాగే పాడి పశువులు గొర్రెలు, మేకలు, ఆవులు వంటి పశువులు పెంపకం దారులకు కూడా పశుగ్రాసం, పశువులకు త్రాగునీటికి చాలా ఉపయోగమని గొర్రెలు మేకలు, పెంపకం దారులు సంతోషపడుతున్నారు.కానీ చెరువు గుట్టు రెండు వైపుల కంప, చీకి చెట్లు ఎపుగా పెరిగి ఉన్నాయని, వాటి వేర్లు చెరువు కట్ట లోతుగా వెళతాయని తద్వారా చెరువు కట్టకు చీలికలు ఎర్పడే ప్రమాదం ఉందని,కావున కంపెచెట్లను తొలగించాలని రైతులు,ప్రజలు కోరుతున్నారు.

Posted Under AP
Editor