అనంతపురం జిల్లాపెద్ద పప్పురు మండలంలోని సీమలవాకుపల్లె టోల్గేట్ వద్ద రైల్వే గేటు వేయడంతో వరుసగా వాహనాలు నిలబడ్డాయి చివరగా కారు నిలబడి ఉండగా వెనకనుంచి ఐచర్ వాహనం అతివేగంగా వచ్చి కారును ఢీకొంది. వాహనం ఢీకొనడంతో ముందు ఉన్న వాహనానికి వెనక వాహనానికి మధ్యలో కారు ఉండడంతో కారు నుజ్జు అయింది అందులో ముగ్గురు ప్రయాణిస్తుండగా వెనక కూర్చున్న వ్యక్తి అజయ్ అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి సమంత మరియు డ్రైవర్ నరసింహారెడ్డి కి తీవ్ర గాయాలు అయ్యాయి. కారు నుజ్జు కావడంతో వారిని బయట తీసేందుకు చాలా అవస్థల బడి వెలికి తీశారు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స నిమిత్తం మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి తరలించారు. వీరు బెంగళూరుకు వెళ్లేందుకు పామిడి నుంచి వస్తూ ఉండగా ఈ ఘటన సంభవించింది. డ్రైవర్ నరసింహారెడ్డి చెప్పిన వివరాల మేరకు వీరు సాట్రాక్ బెంగళూరు కంపెనీలో పని చేస్తున్నారని వారిని తాడిపత్రిలో వదిలిపెట్టి బస్సు ఎక్కించిన అనంతరం కడప జిల్లా ఎర్రగుంట్లకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
రైల్వే గేటు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం: ఐచర్ వాహనం ఢీకొని కారు నుజ్జునుజ్జు.. యువకుడు మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు
