రాష్ట్రస్థాయి యోగా పోటీలకు శాంతి ఆనంద విద్యార్థులు

ముదిగుబ్బ: తిరుపతిలో ఈ నెల 24 నుంచి 27 వరకు జరగనున్న రాష్ట్రస్థాయి అమరావతి ఛాంపియన్‌షిప్ యోగా పోటీలకు ముదిగుబ్బ శాంతి ఆనంద పాఠశాల విద్యార్థులు ఎంపికయ్యారు.
అండర్‌–17, అండర్‌–23 విభాగాల్లో సాంప్రదాయ యోగా, ఆర్టిస్టిక్‌ సోలో, జత, గ్రూప్‌ విభాగాల్లో విద్యార్థులు పాల్గొననున్నారు. జిల్లాస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులను పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అభినందించారు.
తిరుపతిలో జరిగే పోటీల్లో విద్యార్థులు ప్రతిభ కనబరిచి పతకాలు సాధించాలని ఆకాంక్షించారు.

Posted Under AP
Editor