చార్మింగ్ స్టార్ శర్వానంద్ హీరోగా మాస్ డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక పీరియడ్ యాక్షన్ డ్రామా ‘భోగి’ సినిమా విడుదల వాయిదా పడింది. ముందుగా ఈ చిత్రాన్ని ఆగస్టు 28న థియేటర్లలో గ్రాండ్గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
అయితే తాజా సమాచారం ప్రకారం, అనుకున్న తేదీకి ‘భోగి’ ప్రేక్షకుల ముందుకు రావడం లేదని చిత్రబృందం అధికారికంగా వెల్లడించింది. కొత్త రిలీజ్ డేట్ను త్వరలో ప్రకటిస్తామని మేకర్స్ తెలిపారు.
1960ల నాటి ఉత్తర తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో, ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. భారీ బడ్జెట్తో ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రం కొత్త విడుదల తేదీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
