Latest Posts

ముదిగుబ్బ మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు పంచ సమ్మేలన్ వికసిత భారత్ జీ రామ్ జీ చట్టం పై అవగాహన

ముదిగుబ్బ yes9TV

ఎంపీపీ,జడ్పిటిసి,ఎంపీటీసీ సభ్యులకు మరియు గ్రామపంచాయతీ ప్రత్యేక అధికారులు అవగాహన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ముదిగుబ్బ ఎంపీపీ గొడ్డుమర్రి ఆదినారాయణ యాదవ్ అన్నగారు పాల్గొనడం జరిగింది.ఈ సందర్భంగా ఎంపీపీ గారి మాట్లాడుతూ వికసిత భారత్ – గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ ఆజివికా మిషన్ (గ్రామీణ్) అంటే VB-G RAM G చట్టం, 2025.ఇది పాత మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం MGNREGA స్థానంలో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టం.2025 డిసెంబర్ 21న రాష్ట్రపతి ఆమోదం పొంది,1 జూలై 2026 నుండి అమల్లోకి వచ్చింది.పంచ సమ్మేలన్ అవగాహన కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం ఏమిటంటే గ్రామ ప్రధానులు,పంచాయతీ సభ్యులు,గ్రామీణులకు ఈ కొత్త చట్టం గురించి అవగాహన కల్పించడానికి దేశవ్యాప్తంగా “పంచసమ్మేలన్”లుజరుగుతున్నాయి.మన రాష్ట్రంలో రైల్వే కోడూరు నుండి ఈ పథకం దేశవ్యాప్తంగా ప్రారంభమైంది. CM చంద్రబాబు గారు APకి రూ.7700 కోట్ల కేంద్ర నిధులు, రాష్ట్రం నుండి రూ.4000 కోట్లతో పనులు చేపట్టారు.VB-G RAM G ముఖ్యంగా ఉపాధి పని దినాలను 100 రోజుల నుండి 125 రోజులకు పెంచడం.గ్రామీణ ప్రాంతాల్లో జల్ జీవన్ మిషన్, సాగునీటి ప్రాజెక్టులు, వ్యవసాయ మౌలిక సదుపాయాలు,డైరీ,పశుపాలన,గ్రామీణ వేర్‌హౌస్ లకు ప్రాధాన్యత కల్పించడం.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో హాజీవలి,ఉప మండల పరిషత్ అభివృద్ధి అధికారి మంజుల,ఏపీవో గోపాల్, టెక్నికల్ అసిస్టెంట్లు, పంచాయతీ ప్రత్యేక అధికారులు,పంచాయతీ సెక్రటరీలు, ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొనడం జరిగింది.

Posted Under AP
Editor