వినాయక చవితి పండుగ సందర్భంగా గతంలో కేసులలో నిందితులైన 22 మందిపై ముందస్తు చర్యలు – బౌండ్ ఓవర్ చేసిన ముదిగుబ్బ పోలీసులు
ముదిగుబ్బ yes9TV
రానున్న వినాయక చవితి పండుగ సందర్భంగా ముదిగుబ్బ మండలంలో శాంతిభద్రతలను పరిరక్షించేందుకు ముదిగుబ్బ పోలీసులు విస్తృత స్థాయిలో ముందస్తు చర్యలు చేపట్టారు.స్టేషన్ పరిధిలో *క్రైమ్ నెం.154/2023లో హత్య, హత్యాయత్నం, అల్లర్లు తదితర నేరాలు, క్రైమ్ నెం.156/2023లో హత్యాయత్నం, అల్లర్ల కేసు మరియు క్రైమ్ నెం.110/2022లో ఎస్సీ/ఎస్టీ (అత్యాచార నిరోధక) చట్టానికి సంబంధించిన కేసులో నిందితులుగా వున్న 22 మంది ని తహసీల్దార్, ముదిగుబ్బ గారి ఎదుట హాజరుపరచి, భవిష్యత్తులో ఎటువంటి శాంతిభద్రతల సమస్యలకు కారణం కాకుండా ఉండే విధంగా బౌండ్ ఓవర్ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా ఆయా వ్యక్తులకు వినాయక చవితి పండుగతో పాటు ఇతర పండుగలు, ఉత్సవాల సమయంలో ఎలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడరాదని, ప్రజల మధ్య శాంతి సామరస్యాలకు భంగం కలిగించే విధంగా వ్యవహరించరాదని, చట్టాన్ని గౌరవిస్తూ పోలీసు శాఖకు పూర్తి సహకారం అందించాలని తహసీల్దార్ గారి సమక్షంలో సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ముదిగుబ్బ *ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మాట్లాడుతూ, బౌండ్ ఓవర్ చేయబడిన ప్రతి వ్యక్తి రూ.5,00,000/- (ఐదు లక్షలు) పరిమితితో బౌండ్ ఓవర్ చేయబడినట్లు తెలిపారు. బౌండ్ ఓవర్ అమలులో ఉన్న కాలంలో ఎవరైనా తిరిగి ఏదైనా నేరానికి పాల్పడినట్లయితే, సంబంధిత వ్యక్తిపై సెక్యూరిటీ బాండ్‌ను ఎగ్జిక్యూట్ చేస్తూ తహసీల్దార్ (ఎం.ఆర్.ఓ.) గారి ద్వారా రూ.5,00,000/- సెక్యూరిటీ బాండ్ మొత్తాన్ని వసూలు చేసే చర్యలు తీసుకోబడతాయని తెలిపారు. ఒకవేళ సదరు మొత్తాన్ని చెల్లించడంలో విఫలమైతే, చట్టప్రకారం సంబంధిత వ్యక్తిని రిమాండ్‌కు పంపించే చర్యలు తీసుకోబడతాయని స్పష్టం చేశారు.
*గతంలో కూడా బౌండ్ ఓవర్ నిబంధనలను ఉల్లంఘించి తిరిగి నేరాలకు పాల్పడిన వ్యక్తులపై సెక్యూరిటీ బాండ్‌ను ఎగ్జిక్యూట్ చేసి, చట్టప్రకారం వారిని రిమాండ్‌కు పంపిన సందర్భాలు ఉన్నాయని తెలిపారు. అందువల్ల బౌండ్ ఓవర్ చేయబడిన ప్రతి వ్యక్తి నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని హెచ్చరించారు.అన్ని పండుగలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా పోలీసు శాఖ నిరంతరం అప్రమత్తంగా ఉండి అవసరమైన అన్ని భద్రతా చర్యలు చేపడుతుందని తెలిపారు.
వినాయక చవితి వేళ ముదిగుబ్బ పోలీసుల ముందస్తు చర్యలు: 22 మంది పాత నిందితుల బౌండ్ ఓవర్
