ముదిగుబ్బ yes9TV
ఆచార్య NG రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం డీన్ ఆఫ్ స్టూడెంట్ ఆఫైర్స్ మరియు ఎల్నినో కాంపెయిన్స్ ఇంచార్జి డా. సంపత్ కుమార్,కదిరి వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్తలు డాక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి,డాక్టర్ మాధవీ లత, మండల వ్యవసాయ అధికారి రవీంద్ర , అడవి బ్రాహ్మణ పల్లి,నల్లచెర్లోపల్లి, రంగాపురం, మంగళ మడక గ్రామాల్లో పాల్గొని ఎల్నినో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.ప్రస్తుత ఎల్ నినో పరిస్థితుల్లో రైతులు అనుసరించాల్సిన శాస్త్రీయ సాగు విధానాలు డ్రైలాండ్ టెక్నాలజీలు వర్షాభావ పరిస్థితులలో పంటల సాగు నిర్వాహణ పద్ధతులను రైతులకు వివరించారు. అలాగే రైతుల పొలాల్లో వేరుశనగ పంటను పరిశీలించి అందులో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి రైతులకు సూచనలు మరియు సలహాలు తెలియ చేయడం జరిగింది.అలాగే ఆగస్ట్, సెప్టెంబర్ లో ఎల్ నినో ప్రభావం వల్ల వర్షపాతం తగ్గే అవకాశం ఉన్నందున రైతులు ముందస్తు ప్రణాళికతో వ్యవసాయం చేయడం అవసరం. దీనికి అనుసరించాల్సిన ముఖ్యమైన చర్యలు .ఈ పరిస్థితుల్లో పంటపై కరువు ప్రభావాన్ని తగ్గించి మొక్కల ఎదుగుదల మరియు దిగుబడిని మెరుగుపరచడానికి ఆకులపై పోటాషియం నైట్రేట్ లేదా19-19-19 నీటిలో కరిగే ఎరువు 10 గ్రాములు ఒక లీటర్ నీటికి పోషక ద్రావణాలలో ఏదైనా ఒకదానిని పిచికారి చేయాలని వివరించారు. ఈ కార్యక్రమానికి మండలంలో ఉన్న వ్యవసాయ సిబ్బంది, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది అలాగే రైతుసోదరులు పాల్గొన్నారు…
పంట బెట్ట పరిస్థితుల్లో పొటాషియం నైట్రేట్ స్ప్రే చేయాలి ఎల్ నినో ప్రభావం పై రైతులకు అవగాహన కార్యక్రమం
