మెగా డీఎస్సీపై చర్చకు సిద్ధం : ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి

విశాఖ :

మెగా డీఎస్సీపై చర్చకు సిద్ధం : ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి

మెగా డీఎస్సీ నియామకాల్లో అవకతవకలు జరి గాయంటూ వైసీపీ చేస్తున్న ఆరోపణలను ఎమ్మె ల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఖండించారు. విశాఖలోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాల యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

మెగా డీఎస్సీ నియామకాలు పూర్తిగా పారదర్శ కంగా జరిగాయని, ఈ అంశంపై చర్చకు టీడీపీ సిద్ధంగా ఉందన్నారు. వైసీపీ నుంచి ఏ స్థాయి నాయకుడు వచ్చినా టీడీపీ నుంచి అదే స్థాయి నాయకుడు చర్చకు వస్తారని చెప్పారు. మెగా డీఎస్సీతో పాటు గ్రూప్-1, 2006 డీఎస్సీ నియా మకాలపై కూడా చర్చించేందుకు సిద్ధమని పేర్కొ న్నారు.

షాప్ చైర్మన్ రావి నాయుడు మాట్లాడుతూ.. డీఎస్సీ పై పదేపదే చర్చకు సవాల్ విసిరినా వైసీపీ నాయకులు ముందుకు రావడం లేదన్నా రు. మెగా డీఎస్సీలో అవకతవకలు జరిగాయని ఒక్క ఆధారం కూడా చూపలేక పోతున్నారని విమర్శించారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవాన్ని దారి మళ్లిం చేందుకే వైసీపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

ఈ సమావేశంలో రాష్ట్ర అధికార ప్రతినిధి మద్ది పట్టాభి సూర్యప్రకాశ్, పార్టీ నాయకులు, షాప్ డైరెక్టర్లు, తెలుగు యువత నాయకులు పాల్గొ న్నారు.

Posted Under AP
Editor