ప్రతి రైతు కూడా వాతావరణ భీమా పథకాన్ని వినియోగించుకోవాలి: జిల్లా ఉద్యాన శాఖ అధికారి ఉమాదేవి

 

అనంతపురం, జులై 30 :

– జిల్లాలోని ప్రతి ఉద్యాన రైతు కూడా వాతావరణ భీమా పథకాన్ని వినియోగించుకోవాలని జిల్లా ఉద్యాన శాఖ అధికారి ఉమాదేవి పేర్కొన్నారు.

– క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ లో ఐదు ఉద్యాన పంటలు కవర్ అవుతున్నాయని, రైతులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని బీమా ప్రీమియం కట్టాలని కోరుతున్నామన్నారు. ఎండుమిరపకి ఇన్సూరెన్స్ ఉందని, తర్వాత వెదర్ బేస్డ్ ఇన్సూరెన్స్ కింద మనకి దానిమ్మ, బత్తాయి, అరటి, టమాటా ఈ నాలుగు పంటలకి వాతావరణ బీమా పథకము అమలవుతోందన్నారు. దయచేసి ప్రతి రైతు ప్రీమియం కట్టాలని, ఇంకా రెండు రోజులు మాత్రమే సమయం ఉందని, ఈనెల 31లోపు బీమా ప్రీమియం కట్టాలని కోరారు.

– దానిమ్మకు చూస్తే ప్రీమియం 3,750 రూపాయలు ఒక ఎకరాకి, అలానే బత్తాయికి 2,750 రూపాయలు, టమాటాకి 1,600 రూపాయలు అని, అరటికి 3,000 రూపాయలు ఒక ఎకరాకి ప్రీమియం చెల్లించాలన్నారు. ఎందుకంటే ఈ ఏడాది మనకి వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయని, ఇప్పటిదాకా పడాల్సిన వర్షపాతం కూడా పడలేదని, ప్రతి రైతు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. వర్షపాతం, రిలేటివ్ హ్యూమిడిటీ, టెంపరేచర్ ఈ మూడు కండిషన్స్ లో ఏదైనా అడ్వర్స్ గా ఉందంటే మాత్రం ఇన్సూరెన్స్ క్లైమ్ రావడానికి అవకాశం ఉందన్నారు. ఈ సంవత్సరం ప్రతికూల వాతావరణం ఉంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ వాతావరణ భీమా పథకాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నామన్నారు.

Posted Under AP
Editor